జులైలో పార్లమెంట్ సమావేశాలు

జులైలో పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 18 నుంచి ప్రారంభమయ్యే అవకాశమున్నది. నెలరోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాలు ఆగస్టు 12న ముగియనున్నాయి. పార్లమెంటరీ వ్యవహరాలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్‌ కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నది. కాగా ప్రస్తుత పార్లమెంట్‌ భవనంలో జరుగనున్న చివరి సమావేశాలు ఇవేనని తెలుస్తున్నది. వచ్చే శీతాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్‌ భవనంలోనే నిర్వహిస్తామని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నడం తెలిసిందే.

 

Tags :