పొత్తులపై జనసేన క్లారిటీ

పొత్తులపై జనసేన క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పొత్తులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరింత క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఓట్లు చీలకుండా అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు. రాజధానిపై ఒప్పించినట్లే ఓట్ల చీలిక అంశంపైనా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓట్లు చీలనివ్వకూడదని నిర్ణయం తీసుకున్నానన్నారు. రాజకీయ ప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని జనసేనాని అన్నారు. ఎవరితో పొత్తులకు వెళ్లాలో వైసీపీ మాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. 

 

Tags :