తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తాం : జనసేన

తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తాం : జనసేన

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేయనున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మూడో వంతు స్థానాల్లో పోటీ  చేస్తామని తెలిపారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేనకు 5వేలకు పైగా ఓట్లున్నాయి. అయితే వాటితో గెలవలేం. కానీ కచ్చితంగా తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపిస్తుందని మాత్రం చెప్పగలను. తెలంగాణ రాజకీయాలను జనసేన శాసిస్తుందన్నారు. తెలంగాణలో జనసేన బలోపేతానికి పనిచేస్తామన్నారు. రాజీయాల్లో దెబ్బతిన్న వాడిని కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జనసేన బలాలు, బలహీనతలు నాకు బాగా తెలుసు. తెలంగాణలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో జనసేన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడ ప్రతి చోటా మాకు అభిమానుల అండ ఉంది. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయాన్ని పార్టీ నేతలతో చర్చించి తీసుకుంటామనన్నారు.  తెలంగాణలో సామాజిక మార్పు కోరుకుంటున్నారు. ఆశయం కోసం నిలబడేవారికి ఎప్పటికీ ఓటమి ఉండదు అని అన్నారు.

 

Tags :