సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. సమాజం కోసం

సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. సమాజం కోసం

తాను సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని, సమాజం కోసం వచ్చానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలకు అరుపులు, కేకలు తప్ప సరిగా మాట్లాడడం రాదని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడానికేనా ప్రజలు జగన్‌ను ఎన్నుకుందని ప్రశ్నించారు. అభివృద్ధి పక్కపక్కనే ఉండాలని, నవరత్నాలు అనే ఉంగరం ఇస్తే, ప్రజల ఆకలి తీరుతుందా? అని నిలదీశారు. చదువుకోవాల్సిన పదేళ్ల విద్యార్థి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024లో వైసీపీని ఓడిరచాలంటే జన సైనికుల్లో ఐక్యత ముఖ్యమని సూచించారు. వైసీపీ నేతలకు జనసైనికులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

 

Tags :