జగన్ కు అప్పురత్న ఇవ్వాలి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు కొత్త రికార్డులు నమోదు చేసే స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన 9 నెలల కాలానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.55,555 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. అప్పులతో ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు. అప్పులతో ఆంధ్రా పేరును ఇలానే కొనసాగించండి. మీ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం మాత్రం మరిచిపోవద్దు. రాష్ట్రాభివృద్ధి, సంపదను కుక్కలకు వదిలేయండి. భారతరత్న మాదిరిగా మీకు అప్పురత్న అవార్డు ఇవ్వాలి అని పవన్ ఎద్దేవా చేశారు.
Tags :