విభజన తర్వాత ఇక్కడ టీడీపీకి.. అక్కడ టీఆర్‌ఎస్‌కి

విభజన తర్వాత ఇక్కడ టీడీపీకి.. అక్కడ  టీఆర్‌ఎస్‌కి

రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ టీడీపీకి, అక్కడ టీఆర్‌ఎస్‌కి అవకాశం ఇచ్చారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక వీరమహిళల రాజకీయ అవగాహన, పునశ్చరణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్తులో కులాలు, మతాల ప్రాస్తావన లేని రాజకీయాలు రావాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏర్పడే ప్రభుత్వాలు నిలబడవన్నారు. దేశంలో మత ప్రస్తావన లేని ప్రభుత్వాలు రావాలని తెలిపారు. దేశంలోని బాష, యాసను అందరూ గౌరవించాలని ఆయన సూచించారు. ప్రాంతీయతను గుర్తించకపోతే జాతీయవాదం రాదన్నారు. ఇద్దరు ఎంపీలు నుంచి అధికారం వచ్చే వరకు బీజేపీ పోరాటం చేసిందన్నారు. ఏ పార్టీ అయినా మొదట చిన్నగానే ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో పురుషుల అధిక్యమే ఉందన్నారు. జనసేనలో మహిళలను చైతన్య వంతులుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

 

Tags :