రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి : పవన్ కల్యాణ్

రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి : పవన్ కల్యాణ్

తెలుగు ప్రజలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతికి తెలుగువారందరికీ ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలని ఆకాంక్షించారు. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సౌభాగ్యంగా ఉండాలని కోరుకున్నారు.  ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసుకుని రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి పండుగ అని పేర్కొన్నారు. భారతీయ పండగలన్నీ ప్రకృతి, పర్యావరణ ఆధారిత సంబరాలేనని తెలిపారు. భారతీయులందరికీ తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.

 

Tags :