కొండగట్టులో వారాహి కి పవన్ పూజలు

కొండగట్టులో వారాహి కి పవన్ పూజలు

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన ప్రచార రథం వారాహి కి వేదపండితులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించిన తర్వాత దాన్ని ఆయన ప్రారంభించారు. పవన్‌ చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు కొండగట్టుకు భారీగా తరలివచ్చారు. గజమాలతో ఆయన్ను సత్కరించారు. అభిమానులకు  ఓపెన్‌ టాప్‌ వాహనం నుంచి పవన్‌ అభివాదం చేశారు.

 

 

Tags :