వాటి గురించి మంత్రులు ఎందుకు చర్చించడం లేదు ? : పయ్యావుల

వాటి గురించి మంత్రులు  ఎందుకు చర్చించడం లేదు ? :  పయ్యావుల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యల్లేనట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ విమర్శించారు. పీఏసీ సమావేశంలో విద్యుత్‌ కొనుగోళ్లపై చర్చించిన అనంతరం పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇతరత్రా సమస్యలు ఏమీ లేనట్టగా సినిమా టికెట్ల ధరల గురించి మంత్రులు చర్చించుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల జీవితాల్లో సినిమా  కష్టాలను మించిన కష్టాలు ఉన్నాయన్నారు. వాటి గురించి మంత్రులు ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలు, తగ్గిన ఉద్యోగుల వేతనాలు, నిరుద్యోగ యువత కోసం మంత్రులు ఏనాడైనా చర్చించారా? అని నిలదీశారు. రాష్ట్ర మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడం  ఎప్పుడో మానేశారని ఎద్దేవా చేశారు.

 

Tags :