వైసీపీ నేతలకు లేని షరతులు.. తనకే ఎందుకు? : పయ్యావుల

వైసీపీ నేతలకు లేని షరతులు.. తనకే ఎందుకు? : పయ్యావుల

భద్రత విషయంలో వైసీపీ నేతలకు లేని షరతులు తనకే ఎందుకని, అంత అవసరం ఏమొచ్చిందని ఆంధ్రప్రదేశ్‌ పీఏసీ చైర్మన్‌, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళితే తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రకంపలను వస్తున్నాయని అన్నారు. మూడేళ్ల తర్వాత ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుతో మాట్లాడేందుకు అక్కడ చాలా మంది నేతలు ఉత్సాహం చూపించారని తెలిపారు. సీఎం జగన్‌ కూడా ఢిల్లీ వెళ్లారని ప్రత్యేక హోదా, పోలవరం నిధులు తదితర అంశాలపై ప్రధానితో ఏమైనా చర్చించారా? అని ఆయన ప్రశ్నించారు. అక్కడ ఏం జరిగిందనేది ప్రజలకు సీఎం చెప్పాల్సిన అవసరముందన్నారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు  సమాచారముందని ఆయన తెలిపారు. తన నియోజకవర్గం ఉరకొండ ప్రాంతంలో ఇటీవల మాజీ నక్సలైట్ల కదలికలు పెరిగాయన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన గన్‌మెన్లనే ఎందుకు మారుస్తున్నారని నిలదీశారు.

 

Tags :