విభజన చట్టంలోని అంశాలపై సీఎం ఏమైనా చర్చించారా? : రేవంత్

విభజన చట్టంలోని అంశాలపై సీఎం ఏమైనా చర్చించారా?  : రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‍ ఢిల్లీ పర్యటనలో విభజన చట్టంలోని అంశాలపై ఏమైనా చర్చించారా? అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‍ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్‍ గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్‍ నేతలు భేటీ అయ్యారు. అనంతరం రేవంత్‍ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్రంలో కాంగ్రెస్‍ పార్టీ బలోపేతం గురించి రాహుల్‍తో చర్చించినట్లు తెలిపారు. తెలంగాణలో తరచూ పర్యటించాలని రాహుల్‍  కోరినట్లు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‍ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‍ చేశారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‍ మధ్య ఉత్తర్‍ప్రదేశ్‍ ఎన్నికల గురించి చర్చ జరిగిందని అన్నారు. అక్కడ ఎంఐఎం ఎన్ని చోట్ల పోటీ చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలిపారు. మోదీ, కేసీఆర్‍ మిలాకత్‍కు బండి సంజయ్‍, ఈటల రాజేందర్‍ బలికాక తప్పదని అన్నారు. సంజయ్‍ ఈటల ఎంత తిరిగినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. డిసెంబర్‍ 9 నుంచి సభ్యత్వ కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.

 

Tags :