‘రొమాంటిక్’ మే ‘పీనే కె బాద్’ క్యా వువా? ఆ తర్వాత అంతే ఖుషినే...

‘రొమాంటిక్’ మే  ‘పీనే కె బాద్’ క్యా వువా? ఆ తర్వాత అంతే ఖుషినే...

దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా.. అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రొమాంటిక్’. ఈ సినిమాను దీపావళి కానుకగా.. ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘పీనే కె బాద్’ అనే పాటను విడుదల చేశారు. తెలుగు సినిమాల్లో ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ స్టైల్ వేరు.. ఆయన సినిమాల్లో ఉండే డైలాగ్స్.. హీరోయిజం.. విభిన్నంగా ఉంటాయి. చాలా రియలిస్టిక్‌గా.. మాస్‌గా హీరోలను చూపించడంలో.. పూరి ముందుంటారు. ఇక ఆయన సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక యాక్షన్ మాత్రమే కాదు.. రొమాన్స్, కామెడి, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలను కలగలిపి.. అద్భుతంగా సినిమాలు చేస్తారు పూరి. ఇక ఆయన కుమారుడు ఆకాష్ పూరి.. ఆయన తీసిన పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ‘ఆంధ్రపోరి’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా అంతలా ఆడలేదు. ఆ తర్వాత ఆయన తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే ‘మెహబూబా’ అనే సినిమాలో నటించారు. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. ఇక త్వరలో ఆయన ‘రొమాంటిక్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు అనిల్ పాదురి దర్శకత్వం వహించగా.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ని పూరి జగన్నాథ్ అందించారు. అంతేకాక.. ఈ సినిమాకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు.

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలాకాలమే అయినా.. కరోనా వ్యాప్తి కారణంగా విడుదల వాయిదాపడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాను దీపావళి కానుకగా.. నవంబర్ 4వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి ‘పీనే కె బాద్’ అనే పాట లిరికల్ వీడియోని విడుదల చేశారు. చిత్ర యూనిట్. ఈ పాటకు భాస్కరభట్ల, పూరి జగన్నాథ్ సాహిత్యం అందించగా.. సునీల్ కశ్యప్ సంగీతంతో పాటు తన గాత్రాన్ని కూడా అందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటని కొరియోగ్రాఫీ చేశారు. ప్రస్తుతం ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. కేతికా శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, మకరంద్ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునయన కీలక పాత్రలో నటిస్తున్నారు.

 

Tags :