ఈ ప్రభుత్వం నిజంగానే రికార్డు : పీతల

ఈ ప్రభుత్వం నిజంగానే రికార్డు : పీతల

నివాసానికి పనికిరాని స్థలాలను ఇళ్ల నిర్మాణానికి కేటాయించడంలో ఈ ప్రభుత్వం నిజంగానే రికార్డు సాధించిందని మాజీ మంత్రి పీతలసుజాత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎంత కాలం గాలిమాటలతో ప్రజలను మోసగించాలని చూస్తారు? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వమిచ్చిన ఇళ్ల పట్టాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరావని విమర్శించారు.  28 లక్షలమంది పేదలకు ఇళ్లస్థలాలిచ్చి, ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని ప్రభుత్వం చెప్పిందన్నారు. దేశంలోనే తమ ప్రభుత్వం పెద్దరికార్డు సాధించబోతోందంటూ డబ్బాలు కొట్టుకుందని చెప్పారు. జగన్‌ ప్రభుత్వం పార్టీలు, రాజకీయాలు పక్కనపెట్టి ప్రజలకు మంచిచేస్తే సంతోషిస్తామన్నారు.

 

Tags :