బుకాయించిన మాస్కో.. సాక్ష్యం వదిలిన అమెరికా

తమ నిఘా డ్రోన్‌ను రష్యా కూల్చేయడంపై విమర్శలు గుప్పిస్తున్న అమెరికా తాజాగా అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని బయటపెట్టింది. దాదాపు నిమిషం నిడివి ఉన్న వీడియోను విడుదల చేసి రష్యా నిర్లక్ష్య ధోరణిని తప్పుబట్టింది. మార్చి 14వ తేదీన రష్యా యుద్ధ విమానం వల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను ఢీకొట్టింది. అయితే, చాకచక్యంగా వ్యవహరించిన అమెరికా సైన్యం తమ డ్రోన్‌ను కిందకు దించింది. ఆపై యూఎస్ యూరోపియన్ కమాండ్ ఒక ప్రకటన విడుదల చేసింది. నల్ల సముద్రంపై అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్‌లో రష్యాకు చెందిన ఎస్‌యూ-27 ఫైటర్ జెట్లు ఎలాంటి రక్షణ లేకుండా విన్యాసాలు చేపట్టాయి. అందులో ఒకటి యూఎస్‌కు చెందిన ఎంక్యూ-9 డ్రోన్‌ను ఢీకొట్టింది. అని వెల్లడించింది.
Tags :