చైనా ఇప్పటికీ అమెరికాకు పెద్దసవాలే

చైనా ఇప్పటికీ అమెరికాకు పెద్దసవాలే

చైనా ఇప్పటికీ భద్రతపరంగా అమెరికాకు పెద్ద సవాలే అని రక్షణ వ్యూహాలపై పెంటగాన్‌ నుంచి వెలువడిన తాజా నివేదిక వెల్లడించింది. బీజింగ్‌ నుంచి ముప్పు ఏ స్థాయిలో ఉంటుందన్నది ఆధారంగా చేసుకొని అమెరికా తన భావి అవసరాల కోసం సైనిక సంపత్తిని సమకూర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. చైనాతో పోరు అనివార్యమూ కాదు, వాంఛనీయమూ కాదని హెచ్చరించింది. ఇండో`పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా పొత్తులను బలహీనపరచడానికి, పొరుగు దేశాలను బెదిరించడానికి తన అమేయ సైనికశక్తిని చైనా వాడుకుంటోందని నివేదికలో వివరించారు.  పెంటగాన్‌ రక్షణ విభాగ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ అమెరికా మొట్టమొదటిసారిగా రెండు పెద్ద అణ్వాయుధ దేశాలలో (రష్యా, చైనా) ముప్పు ఎదుర్కొంటోందని తెలిపారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.