మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..... ఎన్టీఆర్ను

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ను చంపినందుకు చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి శాపం పెట్టాడని అన్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అన్నాడు. ఇప్పుడు పోలవరం వెళ్లి ప్రజలకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నాడని అన్నారు. చంద్రబాబును, లోకేష్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందని, కాంతారావు సినిమా డైలాగులు ఇప్పుడూ వేస్తే ఎలాగా చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. పాత కాలపు స్వామిజీల తంతులా ఉందని, చంద్రబాబుకు మైండ్ ఉందా? అని నిలదీశారు. ఇదేం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారు. మొన్నటి వరకు బాదుడే బాదుడు అన్నాడని మండిపడ్డారు. హెరిటేజ్ లో రేట్టు బాదుడే బాదుడు అని జనాలకు తెలియదా? జనాలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా అని నిలదీశారు.
Tags :