ప్రజలకు మంచి కోసమే ఈ ఆలోచన

ప్రజలకు మంచి  కోసమే ఈ ఆలోచన

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల అమ్మకం జరగాలని మంత్రి పేర్ని నాన్ని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు మంచి చెయ్యడం కోసమే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే తెలుగుదేశం పార్టీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. సినిమా టికెట్ల అంశం త్వరలో పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం టిక్కెట్ల వ్యాపారం చేస్తుందని ప్రతిపక్షం నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని ఆయన మండిపడ్డారు.  సినిమా టికెట్లను పారదర్శకంగా ప్రజలకు అందిస్తామన్నారు. కానీ దీనిపై కొందరు మేధావులు బయలుదేరారని, వారి దీని నేపథ్యం గమనించాలని సూచించారు. ఆన్‌లైన్‌ టికెట్స్‌ అమ్మకాల ద్వారా బ్లాక్‌ మార్కెట్‌, పన్ను ఎగవేతను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

 

Tags :