అందరూ ఏకమైనా వైసీపీని ఎదుర్కోలేరు

కాపు యువతను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాన్ని స్పందించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో తెగదెంపులు చేసుకుని టీడీపీ పంచన చేరేందుకు ఆయన తహతహలాడుతున్నారని చెప్పారు. ప్రధాని మోదీ మంచివారని చెప్తూనే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం అలా కాదని పవన్ చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా నాని ప్రస్తావించారు. తెలివితేటలను ఎవరైనా పవన్ దగ్గరే నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. మొన్నటిదాకా కులం లేదని చెప్పిన వ్యక్తి ఆవిర్భావ సభలో ప్రత్యేకించి కాపు కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాన్ని విపరీతంగా చేశారని ఆరోపించారు. అందరూ ఏకమైనా వైసీపీని ఎదుర్కోలేరని ధీమా వ్యక్తం చేశారు.
Tags :