పీఎఫ్ఐను టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోంది

పీఎఫ్ఐను టీఆర్ఎస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోంది

ఎంఐఎం కనుసన్నల్లోనే పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) పని చేస్తోందని, పీఎఫ్‌ఐను టీఆర్‌ఎస్‌ పెంచి పోషిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. నాగోల్‌ పాదయాత్రలో బండి మాట్లాడుతూ జిమ్‌, స్వచ్ఛంద సంస్థల పేరుతో పీఎఫ్‌ఐ విస్తరిస్తోందన్నారు. ఎన్‌ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్‌ఐ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? అని ప్రశ్నించారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమేనన్నారు. ఏ స్కామ్‌ చూసినా కేసీఆర్‌ కుటుంబం పాత్ర ఉందని విమర్శించారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న కేసీఆర్‌, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌పై నోరెందుకు మెదపడం లేదని మండిపడ్డారు. సీబీఐ, ఈడీ దాడులు చేసి కేసీఆర్‌  కుటుంబం క్వారంటైన్‌ పోతుందని ఎద్దేవా చేశారు. హిందూ సమాజ సంఘటితే బీజేపీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

 

Tags :