ఒమిక్రాన్ కు వ్యాక్సిన్ సిద్ధం : ఫైజర్

ఒమిక్రాన్ కు వ్యాక్సిన్ సిద్ధం : ఫైజర్

ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కోవడానికి వచ్చే మార్చి నాటికి వ్యాక్సిన్‌ను సిద్ధం చేయనున్నట్టు ఫార్మా దిగ్గజం ఫైజర్‌ కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ను తయారు చేస్తోన్న తమ సంస్థ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కోసం వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తుందని, కంపెనీ సిఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా తెలిపారు. మోడెర్నా ఫార్మాక్యూటికల్‌ సీఈవో స్టీఫెన్‌ మాట్లాడుతూ తమ సంస్థ బూస్టర్‌ డోసును 2022 చివరి నాటికి సిద్ధం చేస్తుందని చెప్పారు. ఒమిక్రాన్‌తో పాటు రానున్న అన్ని వేరియంట్ల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని తెలిపారు.

 

Tags :