5 ఏళ్లలోపు చిన్నారుల కోసం.. ఆమోదం తెలిపిన అమెరికా

5 ఏళ్లలోపు చిన్నారుల కోసం.. ఆమోదం తెలిపిన అమెరికా

అమెరికాలో ఆరు నెలల శిశువుల నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులకు కొవిడ్‌ టీకాల అందుబాటు దిశగా మరో అడుగు ముందుకు పడింది. చిన్నారుల కోసం మోడెర్నా, ఫైజర్‌ సంస్థలు రూపొందించిన టీకాలకు అమెరికా ఆహార ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) సలహాదారులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ టీకాలతో చిన్నారులకు కలిగే నష్టాలతో  పోలిస్తే లాభాలే ఎక్కువని పేర్కొన్నారు. ఈ సూచనలను ఎఫ్‌డీఏ ఆమోదిస్తే.. తర్వాత దశలో వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై  ఈ కేంద్రం సలహాదారులతో ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఇక్కడ కూడా ఆమోదం లభిస్తే అమెరికాలోని ఆసుపత్రులు, ఔషధ దుకాణాల్లో ఈ టీకాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు.

 

Tags :