ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత కానుక

ప్రపంచానికి భారత్ అందించిన అద్భుత కానుక

ప్రపంచానికి భారత్‌ అందించిన అద్భుత కానుక యోగా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోతవ్సం సందర్భంగా మైసూర్‌ ప్యాలెస్‌ (కర్ణాటక) గ్రౌండ్‌లో నిర్వహించిన యోగా డే వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాల్లో మాత్రమే యోగా చేసే వాళ్లు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా యోగా చేస్తున్నారు అని పేర్కొన్నారు. నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో యోగా సాధన జరుగుతోంది. యోగా మనకు శాంతిని కలిగిస్తుంది. యోగా వల్ల కలిగే శాంతి వ్యక్తులకు మాత్రే కాదు, మన దేశాలకు, ప్రపంచానికి శాంతిని తెస్తుంది. అంతర్గత శాంతితో కోట్ల మంది ప్రజలు ప్రపంచ శాంతి వాతావరణాన్ని సృష్టిస్తారు. ఆ  విధంగా యోగా ప్రజలను, దేశాలను కలుపుతుంది. యోగా మనందరికీ సమస్య పరిష్కారానికి దారి తీస్తుంది అని పేర్కొన్నారు.

 

Tags :