ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

భాషా వైవిద్ధ్యం భారత దేశానికి గర్వకారణని,  అయితే దీనిపై వివాదాలు స్పష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో బీజేపీ ఆఫీస్‌ బేరర్ల జాతీయ స్థాయి సమావేశం సందర్భంగా వర్చువల్‌ విధానంలో మోదీ మాట్లాడారు. భాషల ప్రాతిపదికపై వివాదాలు స్పష్టించే ప్రయత్నాలు జరుగుతుండటం కొద్ది రోజులుగా మనం చూస్తున్నామని తెలిపారు. ప్రతి ప్రాంతీయ భాషలోనూ భారతీయ సంస్కృతి ప్రతిబింబాన్ని బీజేపీ చూస్తోందని, అవి పూజించదగినవని పరిగణిస్తుందని తెలిపారు. భారత దేశ మెరుగైన భవిష్యత్తుకు ఇది అనుసంధానమని తెలిపారు. అన్ని ప్రాంతీయ భాషలకు జాతీయ విద్యా విధానం ప్రాధాన్యమిచ్చిందన్నారు. ప్రాంతీయ భాషల పట్ల మన నిబద్ధతకు ఇది నిదర్శనమని తెలిపారు.

 

Tags :