ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం : మోదీ

ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం : మోదీ

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో ఇంకా విదేశీ వస్తువులను ఉపయోగించడం సరికాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పుణెలోని జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ నిర్వహించిన వ్యాపార సదస్సులో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఇకనైనా వాటికి బానిసవ్వడం తగ్గించుకోవాలని పలుపునిచ్చారు. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటం మనం తగ్గించుకోవాలన్నారు. ఎగుమతులకు కొత్త గమ్యాలను గుర్తించాలి. దీనిపై స్థానిక మార్కెట్లలో అవగాహన కల్పించాలన్నారు. దేశంలో ప్రతిభ, వాణిజ్యం, సాంకేతికతకు సాధ్యమైనంత ప్రోత్సాహం లభిస్తోంది. నిత్యం డజన్ల కొద్దీ సార్టప్‌లు నమోదువుతున్నాయి. వారానికో సంస్థ యూనికార్న్‌గా మారుతోంది.  ఆత్మనిర్భరతే మన భవిష్యత్తుకు మార్గం,  పరిష్కారం, ప్రభుత్వ సామర్థ్యానికి ప్రజల సహకారం తోడైతే మార్పు అనేది అనివార్యం అని అన్నారు.

ఇప్పుడు యావత్‌ ప్రపంచం భారత్‌వైపు ఆశతో నమ్మకంతో చూస్తోందన్నారు. ఇది ప్రతీ భరతీయుడు గర్వించదగ్గ విషయమని తెలిపారు. ప్రపంచ శాంతి, శ్రేయస్సు, ప్రపంచం ఎదుర్కొంటోన్న సవాళ్లకు పరిష్కారాల కోసం భారత్‌ చేపడుతోన్న కార్యక్రమాలను అన్ని దేశాలు ఆమోదిస్తున్నాయన్నారు.

 

Tags :