ప్రధాని మోదీ కీలక ప్రకటన

ప్రధాని మోదీ కీలక ప్రకటన

దేశంలో కోవిడ్‌ పరిస్థితి, వ్యాకినేషన్‌ కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాస్‌ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలను సడలించే ప్రణాళికలను సమీక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను కోరారు. కొత్త వేరియంట్‌కు సంబంధించిన పరిణామాలపై క్లుప్తంగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ద్వారా ప్రమాదంలో ఉన్న దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక దృష్టి సారించి, అంతర్జాతీయంగా వచ్చిన వారందరినీ పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నొక్కి చెప్పారు. వీటితో పాటు ముఖానికి మాస్క్‌ ధరించడం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, సామాజిక దూరాన్ని కొనసాగించడం వంటి కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను తప్పకుండా పాటించాలని ప్రధాని సూచించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. కొత్త వేరియంట్లపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

 

Tags :