పుతిన్ తో ప్రధాని మోదీ చర్చలు

పుతిన్ తో ప్రధాని మోదీ చర్చలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ ద్వారా సంభాషించారు. జి7 సమావేశంలో మోదీ పాల్గొన్న కొన్ని రోజుల తరువాత ఈ సంభాషణ జరిగింది. ఉక్రెయిన్‌ సంక్షోభం, ప్రపంచ సరుకుల మార్కెట్‌లో తాజా మార్పులు తో సహా అనేక అంశాలు సంభాషణలో చోటు చేసుకున్నాయి. 2021 డిసెంబర్‌లో పుతిన్‌ భారత పర్యటన సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలుపై ఇరువురు నాయకులు సమీక్షించారు. వ్యసాయ ఉత్పతులు, ఎరువులు, ఫార్మా ఉత్పత్తుల్లో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడంపై ఇద్దరు నాయకులూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు అని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

 

Tags :