ఇచ్చిన మాటకు భారత్ కట్టుబడి ఉంది.. మోదీ పిలుపు

ఇచ్చిన మాటకు భారత్ కట్టుబడి ఉంది.. మోదీ పిలుపు

వాతావరణ పరిరక్షణ దిశలో ఇచ్చిన మాటకు భారతదేశం కట్టుబడి నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ విషయం దేశ కార్యాచరణ, సంబంధిత అంశంలో సాధించిన సత్ఫలితాలతోనే విదితం అవుతోందని తెలిపారు. జర్మనీలో జరుగుతోన్న జి7 సమ్మిట్‌లో ఏర్పాటు అయిన ప్రత్యేక వాతావరణ చర్చా గోష్టిలో మోదీ ప్రసంగించారు. ఉజ్జల భవిష్యత్‌కు పెట్టుబడి, వాతావరణం, ఇంధనం, ఆరోగ్యం అనే ఇతివృత్తంతో ఆ వేదిక నుంచి మోదీ ఇతరులు ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణకు భారతదేశం పలు కీలక చర్యలు తీసుకొంటోందని మోదీ తెలిపారు. అంకితభావంతో వ్యవహరించడం వల్ల ఈ దిశలో సత్ఫలితాలు ఉంటున్నాయి. దీనిని మాటలుగా చెప్పడం కాదు చేతలుగా నిరూపించినట్టు వివరించారు. వాతావరణ పరిరక్షణకు భారతదేశం తీసుకుంటున్న చర్యలకు సంపన్న దేశాలు విరివిగా మద్దతు అందించాలని అభ్యర్థించారు. భారత్‌లో ఇప్పుడు స్వచ్ఛ ఇంధన సాంకేతికత దిశలో విస్తృత స్థాయి మార్కెట్‌ ఏర్పడిరదని, దీనిని అవకాశంగా ఎంచుకుని సద్వినియోగపర్చుకుని పెట్టుబడులకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

 

Tags :