ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ సిద్ధమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోదీ సమావేశాలకు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ 2వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 12:45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ లో బయలుదేరి 2:55 గంటల సమయంలో హైదారాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 3:20 గంటలకు హైటెక్స్‌లోని నోవాటెల్‌లోని హోటల్‌కు చేరుకుంటారు. 3:30 గంటలకు హెచ్‌ఐసీసీ వెళ్తారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్‌గా ఉంచారు. 

3వ తేదీ (ఆదివారం) ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:40 వరకు రిజర్వ్‌గా ఉంచారు. సాయంత్రం 5:55 గంటలకు హైటెక్స్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6:15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్‌ గ్రౌండ్స్‌కు వెళారు. సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటలకు వరకు సభలో పాల్గొంటారు. రాత్రి 7:35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి, రాజ్‌భవన్‌కు గానీ, హోటల్‌కు గానీ చేరుకుని బస చేస్తారు. 4వ తేదీ (సోమవారం) ఉదయం 9:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరుతారు. ఉదయం 10:10 గంటలకు విజయవాడ చేరుకుని ఆంధ్రప్రదేశ్‌లోని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

 

Tags :