అలీఘడ్ కు ఇదో శుభదినం : మోదీ

అలీఘడ్ కు ఇదో శుభదినం : మోదీ

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ యూనివర్సిటీకి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యూపీ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడాకర్‌కు చెందిన ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు.  శంకుస్థాపన తర్వాత మోదీ మాట్లాడుతూ అలీఘడ్‌కు ఇదో శుభదినం అని అన్నారు. రాధాష్టమి రోజున ఈ వేడుక జరగడం మరింత శుభప్రదం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మోదీ రాధాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం కల్యాన్‌ సింగ్‌ను మిస్‌ అవుతున్నట్లు తెలిపారు. ప్రతాప్‌ సింగ్‌ వర్సిటీ అభివృద్ధితో ఆయన సంతోషించి ఉండేవారన్నారు.

జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధించాలనుకుంటున్న యువకులంతా రాజా మహేంద్ర ప్రతాప్‌ సింగ్‌ జీవితాన్ని అధ్యయనం చేయాలని అన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులను దిగుమతి చేసి ఇమేజ్‌ నుంచి ఇండియా బయటపడుతోందన్నారు.  ప్రపంచ దేశాలకు ఇప్పుడు రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఇండియా చేరినట్లు తెలిపారు. ఆధునిక విద్యకు ప్రతాప్‌ సింగ్‌ వర్సిటీ కేంద్రంగా మారుతుందని, ఆ వర్సిటీలో రక్షణ సంబంధింత అంశాలు, రక్షణ ఉత్పత్తుల తయారీ టెక్నాలజీ గురించి స్టడీ చేయనున్నారన్నారు.

 

Tags :