ఇరు దేశాలు కలిసి..వీటిని మరింత విస్తరించాలి : మోదీ

ఇరు దేశాలు కలిసి..వీటిని మరింత విస్తరించాలి : మోదీ

భారత్‌, నేపాల్‌ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయని, ఈ చిగురిస్తున్న సంబంధాలు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా వుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేపాల్‌ పర్యటనలో ఉన్న ప్రధాని లుంబినీలో జరిగిన బుద్ద జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంబంధాలు ప్రయోజనకారిగా ఉంటాయని అన్నారు. బుద్ధ భగవానుడు జన్మించిన స్థలం ఓ అనుభూతిని కలిగిస్తోందన్నారు. 2014లో తాను నాటిన మహాబోధి చెట్టు ఇప్పుడు పెద్ద వృక్షంగా మారిపోయిందని పేర్కొన్నారు. ప్రేమ, సంస్కృతి, ఇరు దేశాల మధ్య అనాదిగా ఉన్నాయని గుర్తు చేశారు.

ఇవన్నీ ఇరు దేశాల మధ్య ఎంత బలపడితే బుద్ద సందేశాన్ని అంత వేగంగా ప్రపంచ వ్యాప్తం చేసినవారవుతామని అన్నారు. సారానాథ్‌, బోధ్‌గయ, ఇండియాలోని ఖుషీనగర్‌ ఇవన్నీ ఇరు దేశాల మధ్య సహజమైన వారసత్వ సంపద అని అన్నారు. ఇకపై ఇరు దేశాలు కలిపి వీటిని మరింత విస్తరించాలన్నారు. బుద్దుడి భోధనలు ఆలోచనలని, అలాగే ఓ సంస్కారాన్ని కూడా కలిగిస్తాయన్నారు. బుద్ధుడి జీవితమంతా త్యాగభూతమైనదేనని అన్నారు.

 

Tags :