రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ బస

ఈ నెల 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. సభ అనంతరం రాజ్‌భవన్‌లో ప్రధాని బస చేస్తారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రాజ్‌భవన్ మార్గాల్లో 4 వేల మంది పోలీసులతో పహారా నిర్వహిస్తున్నట్లు సీపీ ఆనంద్ వెల్లడిరచారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3 వేల మంది పోలీసులతో పహారా కాస్తారని తెలిపారు. ప్రధాని, సీఎంలు, కేంద్ర మంత్రులు సభకు హాజరవుతున్న దృష్ట్యా ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు సీపీ వెల్లడించారు. డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను ఇంచార్జ్‌లుగా నియమించామన్నారు.
Tags :