హైదరాబాద్ కు ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26న హైదరాబాద్ రానున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ప్రారంభమై ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న ద్విదశాబ్ది వేడుకలకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతాని ఐఎస్బీ పాలక మండలి ప్రకటించింది. పర్యటన దాదాపు ఖారారైందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలిపింది. ఐఎస్బీ పూర్వ విద్యార్థులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ ఈ సందర్భంగా సమావేశమవుతారు. అంనతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Tags :