తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన  ఖరారైంది. వచ్చే నెల (ఫిబ్రవరి) 13న ప్రధాని మోదీ హైదరాబాద్‌ నగరానికి రానున్నారు. అదే రోజున సికింద్రాబాద్‌ రైల్వే  స్టేషన్‌ ఆధునీకరణ పనులతో  పాటు పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పరేడ్‌ గ్రౌండ్‌లో రాష్ట్ర బీజేపీ తలపెట్టిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లలో బీజేపీ శ్రేణులు నిమగ్నమయ్యారు. ఈ  నెల 19న  ప్రధాని మోదీ పర్యటన వాయిదాపడడంతో మళ్లీ కొత్త తేదీలను పీఎంవో కార్యాలయం ఖరారు చేసింది.

 

 

Tags :