కేంద్రానికి రాహుల్ వార్నింగ్..

కేంద్రానికి రాహుల్ వార్నింగ్..

తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలోని పాంగాంగ్‌లో చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ పేర్కొన్నారు. అయితే భారత్‌ రియాక్షన్‌పై కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఇలాంటి పేలవమైన వ్యాఖ్యల వల్ల పూచిక పుల్లైనా మందుకు జరగదని రాహుల్‌ ఆక్షేపించారు. భారత ప్రభుత్వం స్పందనతో ఒరిగిందేమీ వుండదన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని రక్షించాలని అన్నారు. పాంగాంగ్‌లో చైనా అక్రమంగా వంతెన నిర్మిస్తోందని, భారత ప్రాదేశీక సమగ్రతపై దాడి చేసినట్లు కాదా? అంటూ ప్రశ్నించారు.

 

Tags :