ప్రధాని మోదీ సంచలన ప్రకటన. ఈ మూడు చట్టాలను

ప్రధాని మోదీ సంచలన ప్రకటన. ఈ మూడు చట్టాలను

ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. రైతుల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరులో చట్టాలను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి జాతినుద్ధేశించి ప్రసంగించిన మోదీ దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. మనస్ఫూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రైతుల ఆందోళన విరమించాలి. మూడు వ్యవసాయ సాగు చట్టాలు పూర్తి వెనక్కి తీసుకుంటున్నాం. శీతాకాల సమావేశాల్లో వ్వవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటాం. వ్యవసాయ బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచాం. తక్కువ ధరకే విత్తనాలు అందేలా కృషి చేస్తాం. ఫసల్‌ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తాం. రైతులను ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించాలని అన్నారు.

 

Tags :