MKOne Telugu Times Youtube Channel

భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. ఎంతంటే ?

భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. ఎంతంటే ?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు విలువ 2.23 కోట్లు. ఎక్కువ శాతం బ్యాంక్‌ డిపాజిట్ల రూపంలో ఆ మొత్తం ఉంది. అయితే ఆయన పేరు మీద ఎటువంటి స్థిరాస్తి లేదు. గాంధీనగర్‌లో ఉన్న స్థలాన్ని ఆయన డొనేట్‌ చేశారు. బాండ్‌, షేర్‌, మ్యుచువల్‌ ఫండ్స్‌లో ఆయనకు పెట్టుబడి లేదు. స్వంత వాహనం లేదు. మోదీకి నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ రూ.1.73 లక్షలు. మార్చి 31వ తేదీన ఇచ్చిన డిక్లరేషన్‌ ఆధారంగా ఈ వివరాలు తెలిశాయి.  ఏడాది కాలంలో మోదీ ఆస్తులు 26.13 లక్షలు పెరిగినట్లు తెలుస్తోంది. గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో ఓ రెసిడెన్షియల్‌ ప్లాట్‌ను ముగ్గురితో కలిసి కొన్నారు. అయితే ఆ ఫ్లాట్‌ను దానం చేసినట్లు తెలుస్తోంది.

 

Tags :