రాష్ట్రవ్యాప్తంగా లేని కరోనా ఆంక్షలు.. భద్రాచలంలో ఎందుకు? : వీరయ్య

రాష్ట్రవ్యాప్తంగా లేని కరోనా ఆంక్షలు.. భద్రాచలంలో  ఎందుకు?  : వీరయ్య

టీఆర్‌ఎస్‌ నాయకులకు కరోనా నిబంధనలు వర్తించవా అని భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా లేని కరోనా ఆంక్షలు భద్రాచలంలో జరిగే ఉత్సవాలకు అమలు జరుపుతున్నారని ఆరోపించారు. భద్రాచలంలో జరిగిన ఉత్తరద్వార దర్వనం వేడుకలకు భక్తులను రానివ్వకపోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సంబరాలు చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ నేతలకు లేని నిబంధనలు భద్రాచలంలో ఎలా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. మేడారంలో జరుగుతున్న సమ్మక్క ఉత్సవాలకు, ఇతర ఉత్సవాలకు లేని నిబంధనలు భద్రాచలంలో విధించడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్‌ నియోజకవర్గం అనే నెపంతోనే భద్రాచలంపై కేసీఆర్‌ వివక్షత చూపుతున్నారని ఆరోపించారు.

 

Tags :