'పోకిరి 4K' స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును చిల్డ్రన్స్ హార్ట్ ఆపరేషన్స్, చదువుకు వినియోగిస్తాం : అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్

'పోకిరి 4K' స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును చిల్డ్రన్స్ హార్ట్ ఆపరేషన్స్, చదువుకు వినియోగిస్తాం : అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్

మహేష్ బాబు కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిచిలిన పోకిరి సినిమాను 4K రిజల్యూషన్‌లోకి రీమాస్టర్ చేసి.. డాల్బీ ఆడియో టెక్నాలజీతో  రీరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన పోకిరి మూవీని   రీరిలీజ్ చేస్తున్నారు.  ఈ స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన డబ్బును చిన్న పిల్లల కోసం వినియోగించాలని అభిమానులు, డిస్టిబ్యూటర్స్ నిర్ణయించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సెలబ్రేషన్స్‌కు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఆగస్టు 9న ఆయన పుట్టినరోజు న పురస్కరించుకుని పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా  తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పోకిరి మూవీని వరల్డ్ వైడ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన మొత్తం డబ్బును చిన్న పిల్లల కోసం వినియోగిస్తున్నట్లు మహేష్ బాబు సతీమణి, నటి నమ్రతా తెలిపారు.

పోకిరి మూవీ స్పెషల్ ఏర్పాటు చేసిన అభిమానులకు ఆమె థ్యాంక్స్ చెబుతూ.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 'సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా పోకిరి మూవీ స్పెషల్ షోలు వేసేందుకు ప్లాన్ చేశాం. అయితే ఈ ప్రకటన చేసినప్పటి నుంచి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొన్ని క్షణాల్లో టికెట్స్ బుక్ చేసుకున్నారు.పోకిరి మూవీ స్పెషల్ షోస్ ద్వారా వచ్చిన డబ్బును మహేష్ బాబు ఫౌండేషన్‌‌కు అందజేయాలని సూపర్ స్టార్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయించారు. ఈ డబ్బును చిల్డ్రన్స్ హార్ట్ ఆపరేషన్స్, చదువుకు వినియోగించనున్నాం. ఈ డబ్బును అందించేందుకు ముందుకు వచ్చిన ఫ్యాన్స్‌కు, డిస్ట్రిబ్యూటర్స్‌కు ధన్యావాదాలు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం..' అంటూ నమ్రతా రాసుకొచ్చారు.మరోవైపు ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించిన పోకిరి మూవీని థియేటర్స్‌లో చూసేందుకు అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ లుక్, ఆ డైలాగ్స్.. మణిరత్నం మ్యూజిక్, పూరీ టేకింగ్ మళ్లీ బిగ్ స్క్రీన్‌పై మరోసారి చూసేందుకు రెడీ అవుతున్నారు. ఆగస్టు 9న పోకిరి సినిమా థియేటర్స్‌లో సందడి చేయనుంది.

 

Tags :