MKOne Telugu Times Youtube Channel

పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనులు పూర్తి

పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనులు పూర్తి

పోలవరం ప్రాజెక్టులో మిగిలిన హైడ్రాలిక్‌ సిలిండర్‌ అమర్చడంతో స్పిల్‌ వే నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. స్పిల్‌ వేలో 48 రేడియల్‌ గేట్ల అమరిక పనులు,అదేవిధంగా 96హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక పనులు సైతం పూర్తి అయ్యాయి. గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్‌ ప్యాక్‌ సెట్ల ఏర్పాటు- పనులు,10 రివర్‌ స్లూయిజ్‌ గేట్ల ఏర్పాటు- తో పాటు-,వీటికి ఒక్కో దానికి 2చొప్పున 10గేట్లకు 20హైడ్రాలిక్‌ సిలిండర్ల అమరిక పనులు ,రివర్‌ స్లూయిజ్‌ గేట్లను ఎత్తడానికి అవసరమైన 10 పవర్‌ ప్యాక్‌ సెట్ల అమరిక పనులు సైతం మెగా ఇంజనీరింగ్‌ సంస్థ పూర్తి చేశారు.

ఇప్పటికే ఫిష్‌ ల్యాడర్‌ నిర్మాణం పూర్తి,140మీ పొడవున, 53.320మీ ఎత్తున, 12.5మీ వెడల్పున గ్యాప్‌-3 కాంక్రీట్‌ ఢ్యాం నిర్మాణం పూర్తి కాగా, 52మీ ఎత్తున స్పిల్‌ వే గైడ్‌ బండ్‌ నిర్మాణ పనులు సైతం వేగవంతం చేసింది మెగా సంస్థ.. అప్రోచ్‌ ఛానెల్‌ లో 64.88లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు, ఫైలెట్‌ ఛానెల్‌లో 5.5లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు, 42.5మీ ఎత్తున 2480మీ పొడవున ఎగువ కాఫర్‌ ఢ్యాం నిర్మాణం పూర్తి చేసినట్లు ప్రాజక్ట్‌ అధికారులు తెలిపారు. 1630మీ పొడవున, 30.5మీ ఎత్తున దిగువ కాఫర్‌ ఢ్యాం నిర్మాణం పనులు, ఈసిఆర్‌ఎఫ్‌ ఢ్యాం నిర్మాణం కు సంబందించి గ్యాప్‌-2 ప్రాంతంలో శాండ్‌ ఫిల్లింగ్‌ పనులు సైతం వేగంగా సాగుతున్నాయిగ్యాప్‌-1లో ఇప్పటికే డివాల్‌ నిర్మాణం పూర్తి కాగా, నేలను గట్టిపరిచే వైబ్రో స్టోన్‌ కాలమ్‌ పనులు పూర్తి అవ్వడంతో పాటు డీప్‌ సాయిల్‌ మిక్సింగ్‌ పనులు సైతం దాదాపు పూర్తి కావొచ్చాయి. జలవిద్యుత్‌ కేంద్రంలో ఇప్పటికే కొండ తవ్వకం పనులు పూర్తి అయ్యింది. జలవిద్యుత్‌ కేంద్రంలో 12ప్రెజర్‌ టన్నెల్స్‌ తవ్వకం పనులు సైతం పూర్తి.ప్రెజర్‌ టన్నెల్స్‌ లో ఫెరల్స్‌ అమరిక పనులు ప్రారంబించారు. జలవిద్యుత్‌ కేంద్రంలో ఎర్త్‌ మ్యాట్‌ కాంక్రీట్‌ పనులు సైతం వేగవంతం గా జరుగుతోంది.

 

Tags :