శరవేగంగా పోలవరం పనులు

శరవేగంగా పోలవరం పనులు

పోలవరం ప్రాజెక్టు పనులను ఆంధప్రదేశ్‍ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. కేంద్రం రూ.2,300 కోట్లను రీయింబర్స్ చేయడంలో జాప్యం జరుగుతున్నప్పటికీ.. ప్రాజెక్టు పనులు నిర్విఘ్నంగా సాగడం కోసం రాష్ట్ర ఖజానా నుంచే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. సీఎం వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి నిర్దేశించిన గడువు 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ వైపు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే.. మరో వైపు వరదల్లోనూ ఎగువ కాఫర్‍ డ్యామ్‍ను 43 మీటర్ల (42.5 మీటర్లు, 0.5 ఫ్రీ బోర్డ్) ఎత్తుతో అధికారులు పూర్తి చేశారు. రివిట్‍మెంట్‍ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. దిగువ కాఫర్‍ డ్యామ్‍లో 80 మీటర్లు మినహా 1,537 మీటర్ల పొడవున 20 మీటర్ల ఎత్తుతో పనులు చేశారు.

నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ప్రవాహం మూడు లక్షల క్యూసెక్కులకు పెరిగింది. వరద ఉధ •తి కాస్త తగ్గాక దిగువ కాఫర్‍ డ్యామ్‍లో ఖాళీ ప్రదేశాన్ని భర్తీ చేసి.. 30.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్‍ డ్యామ్‍ల మధ్య నదిలో నిల్వ ఉన్న నీటిని తోడేసి.. ఎర్త్ కమ్‍ రాక్‍ ఫిల్‍ డ్యామ్‍(ఈసీఆర్‍ఎఫ్‍) పనులు చేపట్టి, 2022 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Tags :