తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ... ఇలాంటి పరిస్థితి : చంద్రబాబు

తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ... ఇలాంటి పరిస్థితి : చంద్రబాబు

తన కాన్వాయ్‌ నిలిపివేయడంపై ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు. టీడీపీ హయాంలో తాము ఎప్పుడూ ఇలా చేయలేదని అన్నారు. తన పాలనలో పోలీసులు ఇలా వ్యవరించడలేదని అన్నారు. రిషికొండకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. రిషికొండ, వైజాగ్‌లో భూకబ్జాలు, ఆక్రమాల సంగతి తేల్చుతామని హెచ్చరించారు. తాను హత్యలు, గుండాయిజం చేసేవాడిని కాదని అన్నారు. తాము రిషికొండ వెళ్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Tags :