మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ...జైల్లో పెట్టినా

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు  ...జైల్లో పెట్టినా

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టినా వెనకడుగు వేయనని, ఎన్ని ఇబ్బందులు వచ్చిన  ప్రజలతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, పోలీస్‌ కేసులు పెట్టిన బయపడేది లేదన్నారు. అయితే తన ప్రయాణం ఏటో, భవిష్యత్‌ కార్యచరణ ఏమిటనేది ఇంకా నిర్ణయించుకోలేదని అన్నారు. ప్రజలు తనతోనే ఉంటున్నారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారనే ఉద్దేశ్యంతోనే తన వెంట నడుస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో  అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు జనంతోనే కలిసి నడుస్తానని అన్నారు. ప్రభుత్వం ఇంకా రెండు మూడు నెలలు ఉంటుందని, ఈ సమయంలోనే ఇంకా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని, అయినా ఓపిక పట్టాల్సిన అవసరం ఉందన్నారు.  తనను నమ్ముకున్న వారికి ఎక్కడ ఇబ్బంది జరిగిన అక్కడ ప్రత్యక్ష మవుతానని, అవసరమైతే నిరాహార దీక్ష సైతం చేస్తానని అన్నారు. 

 

 

 

Tags :