అలా పోటీచేసే దమ్ము మంత్రి కేటీఆర్‌కు ఉందా ? : పొన్నం

అలా పోటీచేసే దమ్ము మంత్రి  కేటీఆర్‌కు ఉందా ? : పొన్నం

సెస్‌ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, నిస్పక్షపాతంగా పోటీ చేయాలని, అలా పోటీచేసే దమ్ము మంత్రి కేటీఆర్‌కు ఉందా అని మాజీ పార్లమెంట్‌ సభ్యుడు పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ ప్రశ్నించారు. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ముఖ్య సమావేశం నిర్వహించి సెస్‌ ఎన్నికలో పార్టీ ఆదేశాల మేరకు అనుసరించాల్సిన కార్యచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో క్వింటాకు 4 కిలోల కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు.  బండి సంజయ్‌ బీజేపీ ఎంపీగా గెలిచినప్పటి నుంచి సెస్‌లో జరుగుతున్న అవినీతి, ఆక్రమాలపై స్పందించలేదని విమర్శించారు.  సిరిసిల్లలో సాండ్‌, భూ వైన్‌, మైన్‌ మాఫియాలకు సంబంధించిన వ్యక్తులు సెస్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా మారనుందని ధ్వజమెత్తారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.