పవన్ కళ్యాణ్ సినిమాకి హ్యాండ్ ఇచ్చిన పూజా హెగ్డే

పవన్ కళ్యాణ్ సినిమాకి  హ్యాండ్ ఇచ్చిన పూజా హెగ్డే

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయన హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా కూడా ఒకటి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. మలయాళంలో సూపర్‌హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ సినిమా రీమేక్‌గా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ సినిమా ఒకటి. ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా.. పవన్‌కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నిత్య మీనన్ నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్‌కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమాలు చేస్తున్నారు.

గతంలో హరీశ్ శంకర్, పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌సింగ్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పటివరకూ వరుస ఫ్లాప్‌లతో ఉన్న పవన్‌కళ్యాణ్‌కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటివరకూ ఆయన కెరీర్‌లోనే అతి పెద్ద హిట్ సినిమాగా ఇది నిలిచింది. దీంతో ఈ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తుంది అని తెలియగానే.. అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. రీసెంట్‌గానే ఈ సినిమా టైటిల్‌ను వెల్లడించారు. అయితే అధికారికంగా ఈ సినిమాను దసరా పండుగ రోజున ప్రారంభిస్తారు అని ప్రకటన వచ్చింది. కానీ, ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే డేట్లు కుదరకపోవడంతో.. సినిమా ప్రారంభం వాయిదాపడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో మరోసారి పవన్ అభిమానులకు నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది.

 

Tags :