ఆయన సేవలకు సరైన గుర్తింపు రాలేదు: కేసీఆర్

ఆయన సేవలకు సరైన గుర్తింపు రాలేదు: కేసీఆర్

ఈ తరంలోని విఖ్యాత నేతల్లో మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఒకరని, ఆయన దేశానికి అందించిన చిరస్మరణీయ సేవలకు సరైన గుర్తింపు రాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. భారతరత్న పురస్కారానికి పీవీ అన్ని విధాలా అర్హులని, అది ఇస్తే ఆయనకు సముచిత గౌరవం దక్కుతుందని తెలిపారు. శాసనసభ ప్రాంగణ మందిరంలో పీవీ తైలవర్ణ చిత్రపటాన్ని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ పీవీ స్థితప్రజ్ఞులు. బహుభాషా కోవిదుడు. నిరంతర సంస్కరణవాది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల నిష్ణాతుడు. దేశం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో పీవీ ఆర్థిక సంస్కరణలతో దేశం నిలకొక్కుకుందన్నారు. పెట్టుబడులతో పాటు ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఆయన చిత్రపటంతో శాసనసభ గౌరవం ఇనుమడిరచింది. పీవీకి భారతరత్న పురస్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసినా ఇంతవరకు కేంద్రం నిర్ణయం తీసుకోలేదన్నారు. పోచారం, మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి కూడా పీవీ సేవలను స్మరించుకున్నారు.

 

Tags :