'కార్తికేయ 2' సినిమాతో భారీ హిట్ కొట్టిన పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో

'కార్తికేయ 2' సినిమాతో భారీ హిట్ కొట్టిన పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ పోస్ట్ ప్రో

పోస్ట్ ప్రో (Post Pro) ఒక పాన్ ఇండియా డబ్బింగ్ కంపెనీ. ఈ కంపెనీని వసంత్ స్థాపించారు. పోస్ట్ ప్రో కంపెనీ లో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ (ఆల్ లాంగ్వేజెస్ డబ్బింగ్) జరిగిన మొదటి పాన్ ఇండియా సినిమా కార్తికేయ 2. తెలుగు సినిమాలను ఇతర భాషల్లో అనువదించినప్పుడు మన నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని అన్ని భాషల అనువాదాలు ఏకకాలంలో హైదరాబాద్ లో జరిగేటట్లుగా పోస్ట్ ప్రో కంపెనీ డిజైన్ చెయ్యబడింది.  తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇతర భాషల్లో ఉన్న డబ్బింగ్ కళాకారులను మరియు రచయితలను హైదరాబాద్ కు రప్పించి నిర్మాతల సౌలభ్యం కోసం కార్తికేయ 2 సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను హైదరాబాద్ లో పూర్తి చేయడం జరిగింది. దీనివల్ల నిర్మాతకు బడ్జెట్ కంట్రోల్ లో ఉండడమే కాకుండా డైరెక్టర్ తన సినిమా అనువాద కార్యక్రమాలను రోజు చూసుకొని అవసరమైన మార్పులు చేసుకోనే వీలు ఉంటుంది, అలాగే చాలా సమయం ఆదా అవుతుంది.  కార్తికేయ 2 సినిమాను ఇతర భాషల్లో అనువదించే అవకాశాన్ని ఎంతో నమ్మకంతో పోస్ట్ ప్రో (Post Pro) కంపెనీకి అప్పగించిన నిర్మాతలు టీ. జి. విశ్వ ప్రసాద్ గారికి, వివేక్ కుచిబొట్ల గారికి అభిషేక్ అగర్వాల్ గారికి, దర్శకులు చెందు మొండేటి గారికి హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారికి వసంత్ గారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రో కంపెనీ పలు భారీ సినిమాలను అనువదించే పనిలో ఉంది.

 

Tags :