బసవతారకం హాస్పిటల్ కు వీల్ ఛైర్ లు అందించిన పొట్లూరి రవి

బసవతారకం హాస్పిటల్ కు వీల్ ఛైర్ లు అందించిన పొట్లూరి రవి

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్  హాస్పిటల్ లో భారత స్వాతంత్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 75వ భారత స్వాతంత్రదినోత్సవ వేడుకల సందర్భంగా ఎన్నారై పొట్లూరి రవి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కు ముప్పై వీల్ ఛైర్లు అందించారు.

ఈరోజు జరిగిన కార్యక్రమంలో బసవతారకం హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ ద్వారా వీల్ చైర్లని హాస్పిటల్ కి అందించారు. పొట్లూరి రవి కుటుంబసభ్యులని సాదరంగా ఆహ్వానించిన బాలకృష్ణ హాస్పిటల్ లోని ఐదువందలకు పైగా రోగులకు బ్రెడ్ పాకెట్స్ పంపిణీ చేసారు. చేతన ఫౌండేషన్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ చైర్మన్ రవి వెనిగళ్ల, కోఆర్డినేటర్ రంగారావు, ముప్పా రాజశేఖర్, పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

Tags :