కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. ఇక అందరికీ కాదు

కేజ్రీవాల్ కీలక నిర్ణయం.. ఇక అందరికీ కాదు

దేశ రాజధాని ఢిల్లీ లో విద్యుత్‌ సబ్సిడీపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ అందరికీ కాదని, కేవలం కోరుకున్నవారికి మాత్రమే ఇస్తామని వెల్లడించారు. ఈ కొత్త నిబంధన అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.  విద్యుత్‌ వినియోగదారులు సబ్సిడీ కావాలని కోరుకుంటే అప్పుడు ఉచిత లేదా రాయితీ విద్యుత్‌ను అందిస్తామన్నారు. సబ్సిడీ కావాలా వద్ద అనే దానిపై ప్రజలు నుంచి అధికారులు వివరాలను తీసుకుంటారు. విద్యుత్‌ ధరలు చెల్లించే సామర్థ్యం ఉన్నవారు తమకు సబ్సిడీ వద్దని, సాధారణ బిల్లును చెల్లిస్తామని ప్రభుత్వాన్ని చెప్పొచ్చు. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించనుంది. అక్టోబరు 1 నుంచి ఎంపిక చేసుకున్నవారికి మాత్రమే విద్యుత్‌పై రాయితీ అందుతుంది అని కేజ్రీవాల్‌  తెలిపారు.

 

Tags :