గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికైన ఏపీ శకటం!

గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికైన ఏపీ శకటం!

దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవం రోజున పరేడ్ జరుగుతందనే విషయం తెలిసిందే. ఈ పరేడ్‌లో ఏపీ నుంచి ‘ప్రభల తీర్థం’ శకటం కూడా ఎంపికైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలకు నిర్వహించిన పోటీలో మొత్తం 17 శకటాలు ఎంపికైనట్లు కేంద్ర రక్షణ శాఖ కార్యాలయం వెల్లడించింది. కోనసీమలో సంక్రాంతి ఇతివృత్తంగా ఏర్పాటు చేసిన ‘ ప్రభల  తీర్థం’ శకటాన్ని కూడా గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. సంప్రదాయానికి అద్దం పట్టే విధంగా ఈ శకటం ఉన్నట్లు రక్షణ శాఖ కార్యాలయం పేర్కొంది. గ్రీన్ హరిత విప్లవానికి నిదర్శనంగా ఉందని కొనియాడింది. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన శకటాలు ఎంపికైనట్లు వెల్లడించింది.

 

 

Tags :