'రాధేశ్యామ్' పక్కా రిలీజ్ డేట్ ప్రకటించడానికి ఎందుకు తటపటాహిస్తున్నారు?

'రాధేశ్యామ్' పక్కా రిలీజ్ డేట్ ప్రకటించడానికి ఎందుకు తటపటాహిస్తున్నారు?

‘బాహుబలి’ సినిమా తర్వాత ‘సాహో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్.. ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే త్వరలో ‘రాధేశ్యామ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు రెబల్ స్టార్. తాజాగా ఈ సినిమాపై మరో అప్‌డేట్ వైరల్ అవుతోంది. 'సాహో' మూవీ తర్వాత ప్రభాస్ తదుపరి సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వరుస బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్'. చాలారోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. చిత్రీకరణ తుది దశకు చేరుకోవడంతో సినిమా టీజర్, ట్రైలర్ ఎప్పుడెప్పుడొస్తుందా అనే కుతూహలం అందరిలోనూ నెలకొంది. అయితే చిత్ర యూనిట్ మాత్రం అభిమానులను ఎప్పటికప్పుడు నిరాశపరుస్తూనే ఉంది. అభిమానులు సోషల్‌మీడియాలో తమకు అప్‌డేట్స్ కావాలి అంటూ ట్రెండింగ్ చేసిన ప్రతిసారి ఏదో ఒక పోస్టర్‌ని వదిలి చేతులు దులుపుకుంటుంది. దీంతో ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అసలు రాధేశ్యామ్ నుంచి అప్‌డేట్స్ ఏమైనా వస్తాయా.. లేదా అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.  

సోషల్‌మీడియాలో వాళ్లు సినిమాకు సంబంధించిన అప్‌డేట్ గురించి వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా సినిమా విడుదలకు సంబంధించి సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది అని తెలుస్తోంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’, పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమాలు విడుదల అవుతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పుడు రాధేశ్యామ్ కూడా ఈ సినిమాలతో పోటీ పడుతుంది అని టాక్ తెలుస్తోంది. ఇక ఈ పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా యు.వి.కృష్ణంరాజు సమర్పణలో రాబోతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్  పోస్టుపోన్డ్ అయింది కాబట్టి ఈ సారైనా పక్కా డేట్ ప్రకటిస్తారేమో చూడాలి. 

 

Tags :